Peddapalli: సూపరింటెండెంట్‌ను సత్కరించిన ఎమ్మెల్యే విజయరమణ రావు!

Peddapalli: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రెండో అవార్డు దక్కడం గర్వకారణమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. సూపరింటెండెంట్ శ్రీధర్‌ను సత్కరించి అభినందించారు.

RAJU, PEDDAPALLI
Published on: 16 Oct 2026 4:01 PM IST
Peddapalli
X

Peddapalli: సూపరింటెండెంట్‌ను సత్కరించిన ఎమ్మెల్యే విజయరమణ రావు!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెండో అవార్డు లభించడం గర్వకారణమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. శుక్రవారం అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రికి రూ. 35 లక్షల నిధులు మంజూరు కావడంతో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితోనే ఈ అవార్డు సాధ్యమైందని, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI