Peddapalli: ఆసుపత్రి వాలంటీర్లకు గౌరవ వేతనాలు అందజేత!

Peddapalli: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వాలంటీర్లకు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా గౌరవ వేతనాలు అందజేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 16 Oct 2026 2:50 PM IST
Peddapalli
X

Peddapalli: ఆసుపత్రి వాలంటీర్లకు గౌరవ వేతనాలు అందజేత!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గత 15 నెలలుగా సేవలందిస్తున్న వాలంటీర్లకు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ వేతనాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని, సేవాభావంతో పనిచేసే వారిని ప్రోత్సహించడం సామాజిక బాధ్యత అని అన్నారు. ఆసుపత్రికి వచ్చే పేద, నిరుపేద రోగులకు సహాయం అందిస్తూ, వైద్య సేవలు సులభంగా పొందేందుకు వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

సమాజ సేవే లక్ష్యంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ప్రజలకు అవసరమైన సందర్భాల్లో తమ వంతు సహకారం అందించేందుకు ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వాలంటీర్లకు గౌరవ వేతనాలు అందించడం ద్వారా వారి సేవలను గుర్తించి, మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డా. మారం తిరుపతి యాదవ్, ట్రస్టీ సామ తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI