Peddapalli: ప్రభుత్వ విప్ విజయరమణరావుకు రాష్ట్ర మంత్రి హోదా
Peddapalli: పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావుతో పాటు మరో ఇద్దరు విప్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.
Peddapalli: ప్రభుత్వ విప్ విజయరమణరావుకు రాష్ట్ర మంత్రి హోదా
పెద్దపల్లి: ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావుకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. (G.O.Rt) నెం.1064ను విడుదల చేసింది. విజయరమణరావుతో పాటు ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), వేముల వీరేశం (నకిరేకల్)లకు కూడా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదాను కల్పించింది.
ఆర్టికల్–18 ప్రకారం ప్రోటోకాల్:
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, 'స్టేట్ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్'లోని ఆర్టికల్–18 ప్రకారం వీరికి రాష్ట్ర మంత్రి హోదాకు సంబంధించిన అధికారిక ప్రోటోకాల్‌లు, మర్యాదలు, సదుపాయాలు వర్తించనున్నాయి.
శాసనసభలో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గాల అభివృద్ధిలో చురుగ్గా వ్యవహరిస్తున్నందుకు గుర్తింపుగానే ప్రభుత్వం ఈ హోదాను కల్పించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావుకు పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.




