Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా 'జీపీడీపీ సంకల్ప్' గ్రామసభ
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో సర్పంచ్ బంగారి రమేష్ అధ్యక్షతన 'జీపీడీపీ సంకల్ప్' గ్రామసభ. 2026-27 యాక్షన్ ప్లాన్ ఆమోదం.
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా 'జీపీడీపీ సంకల్ప్' గ్రామసభ
కాల్వ శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంగారి రమేష్ అధ్యక్షతన ‘జీపీడీపీ సంకల్ప్’ గ్రామసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) లో భాగంగా 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర యాక్షన్ ప్లాన్‌ను ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమోదించారు.
ఈ సమావేశంలో వర్షాకాలంలో తలెత్తే సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, స్వచ్ఛత, ఆరోగ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) మరియు విద్యా రంగానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ 16వ ఆర్థిక సంఘం (16th Finance) మార్గదర్శకాలపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ... శ్రీరాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రణాళికలో కేటాయించిన పనులను అధికారులు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోలి సుధాకర్, ఎఎంసి వైస్ ఛైర్మన్ సబ్బని రాజమల్లు, ఎఎంసి డైరెక్టర్ రవి, వార్డు సభ్యులు పాల్గొనగా... శాఖల పరంగా ANM సరోజన, ఎన్పీడీసీఎల్ (విద్యుత్) అధికారులు, ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్, IKP ప్రతినిధులు, ఆశా వర్కర్లు, విఓలు, అంగన్‌వాడీ టీచర్లు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.




