Odela: కేజీబీవీ హాస్టల్ గోడ దూకి ఇంటర్ విద్యార్థిని పరారూ

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెల కేజీబీవీ నుంచి గోడ దూకి పరారైన ఇంటర్ విద్యార్థిని. సీసీటీవీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

KONDAL, SULTANABAD
Published on: 20 Sept 2026 7:29 PM IST
Odela
X

Odela: కేజీబీవీ హాస్టల్ గోడ దూకి ఇంటర్ విద్యార్థిని పరారూ

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని తెల్లవారుజామున గోడ దూకి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. ఆదివారం తెల్లవారుజామున పాఠశాల కాంపౌండ్ గోడ దూకి బయటకు వెళ్లగా, ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

​ఉదయం విద్యార్థిని కనిపించకపోవడంతో గమనించిన ప్రిన్సిపల్ వెంటనే బాలిక తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి కేసు నమోదు చేశారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థిని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ద్వారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD