Peddapalli: బొజ్జ గణపయ్యకు విశేష పూజలు.. ప్రసాదాల సమర్పణ!

Peddapalli: పెద్దపల్లి ఐటీఐ కాలనీ వినాయక మండపం వద్ద వైభవంగా గణపతి మహా నైవేద్యం. బొజ్జ గణపయ్యకు 108 రకాల ప్రసాదాలు సమర్పించిన భక్తులు.. తరలివచ్చిన కాలనీవాసులు.

RAJU, PEDDAPALLI
Published on: 19 Sept 2026 10:51 PM IST
Peddapalli
X

Peddapalli: బొజ్జ గణపయ్యకు విశేష పూజలు.. ప్రసాదాల సమర్పణ!

పెద్దపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కాలనీ 3వ వార్డులో గణపతి మహా నైవేద్య కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని జిల్లా గ్రంథాలయ కేంద్రం ఎదురుగా ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద భక్తులు మహా నైవేద్యాన్ని నిర్వహించారు. గణనాథుడికి 108 రకాల నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

పులిహోర, పాయసం, లడ్డూలు, మోదకాలు, పండ్లు, అన్న ప్రసాదాలతో సహా 108 రకాల వంటకాలతో బొజ్జ గణపయ్యకు భక్తులు నైవేద్యం పెట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.

ఈ మహా నైవేద్య కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్లు లైసెట్టి బిక్షపతి , ఉత్సవ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల కాలనీల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI