Sultanabad: కేజీబీవీ విద్యార్థిని టాప్ ర్యాంక్.. ఐఏఎస్ దేవసేన చేతుల మీదుగా అవార్డు అందుకున్న సౌమ్య!

Sultanabad: ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కేజీబీవీ విద్యార్థిని బట్టు సౌమ్య.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 May 2026 5:50 PM IST
Sultanabad
X

Sultanabad: కేజీబీవీ విద్యార్థిని టాప్ ర్యాంక్.. ఐఏఎస్ దేవసేన చేతుల మీదుగా అవార్డు అందుకున్న సౌమ్య!

సుల్తానాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి జిల్లా విద్యార్థిని బట్టు సౌమ్యకు రాష్ట్రస్థాయిలో ఘన సత్కారం లభించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని MCRHRD సంస్థలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా విజయోత్సవాల వేదికగా సౌమ్య ఈ పురస్కారాన్ని అందుకుంది.

​సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదివిన బట్టు సౌమ్య, ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అసాధారణ ప్రతిభకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కే. కేశవరావు, కళాశాల & సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన ఐఏఎస్ గార్ల చేతుల మీదుగా సౌమ్యకు రూ. 25,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందించి ప్రభుత్వం సత్కరించింది.

​ఇంగ్లీష్ టీచర్‌కు ప్రత్యేక గుర్తింపు

​ఈ కార్యక్రమంలో భూపతిపూర్ కేజీబీవీ ఇంగ్లీష్ సిఆర్టి (CRT) ఎస్. కవితకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా 100 శాతం ఖచ్చితమైన హాజరును నమోదు చేసినందుకు గాను ఆమెకు ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

​కేజీబీవీకి గర్వకారణం: స్పెషల్ ఆఫీసర్ ఎం. స్వప్న

​సౌమ్య సాధించిన విజయంపై భూపతిపూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ (SO) ఎం. స్వప్న హర్షం వ్యక్తం చేశారు. "సౌమ్య స్టేట్ ర్యాంక్ సాధించడం మా విద్యాలయానికే గర్వకారణం. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, విద్యార్థిని కఠిన శ్రమ వల్లే ఈ అద్భుత మార్కులు సాధ్యమయ్యాయి. సౌమ్యను స్ఫూర్తిగా తీసుకుని కేజీబీవీ విద్యార్థినులందరూ చదువుల్లో మరింత రాణించాలి" అని ఆమె ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొని సౌమ్యకు అభినందనలు తెలిపారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story