Manthani: మంథనిలో పుష్కర ఘాట్ పనుల పరిశీలన: శైలజా రామయ్యార్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి పుష్కరాల ఘాట్, గౌతమేశ్వరాలయ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు.

SHANKAR, MANTHANI
Published on: 29 Oct 2026 7:32 PM IST
Manthani
X

Manthani: మంథనిలో పుష్కర ఘాట్ పనుల పరిశీలన: శైలజా రామయ్యార్!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో జరుగుతున్న గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాలయ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత మంథని పట్టణంలోని పలు ప్రముఖ దేవాలయాలను సందర్శించి, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. మంథనిలో గోదావరి పుష్కర ఘాట్ నిర్మాణం కోసం రూ.23 కోట్ల నిధులను విడుదల చేశామని, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించేలా కాశీ తరహాలో గోదావరి తీరంలో సప్త హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మంథనిలోని ప్రసిద్ధ గౌతమేశ్వర ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గౌతమేశ్వర ఆలయంతో పాటు పట్టణంలోని ఇతర ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించామని తెలిపారు.

గోదావరి పుష్కరాలకు మంథనితో పాటు పెద్దపల్లి జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రహదారుల విస్తరణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

పుష్కరాల సమయానికి అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంట రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, విద్యుత్ అధికారులు ఉన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI