Manthani: కమాన్‌పూర్‌లో 150 వీధి కుక్కల మృతి: పోలీసుల దర్యాప్తు!

Manthani: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 150 వీధి కుక్కలను విషమిచ్చి చంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలకు జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 29 Oct 2026 8:03 PM IST
Manthani
X

Manthani: కమాన్‌పూర్‌లో 150 వీధి కుక్కల మృతి: పోలీసుల దర్యాప్తు!

మంథాని: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో సుమారు 150 వీధి కుక్కలను విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపినట్లు తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామపంచాయతీ సిబ్బందే ఈ ఘటనకు పాల్పడ్డారని జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు? బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్న జంతు ప్రేమికుల డిమాండ్లపై ప్రత్యేక కథనం.

కమాన్‌పూర్‌లో వీధి కుక్కల మృతి తీవ్ర చర్చకు దారితీసింది. రెండు రోజుల క్రితం సుమారు 150 కుక్కలను విషపూరిత ఇంజక్షన్లతో చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.

మృతి చెందిన కుక్కలకు శాస్త్రీయంగా పోస్టుమార్టం నిర్వహించి, మరణాలకు అసలు కారణాలను వెల్లడించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. పోస్టుమార్టం ప్రక్రియపై కూడా ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించాల్సి ఉంది.

వీధి కుక్కల సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించాలి తప్ప, మూగజీవాల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని జంతు ప్రేమికులు పేర్కొన్నారు. కమాన్‌పూర్ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలు నిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI