Peddapalli: కన్యకా పరమేశ్వరి ఆలయంలో అధికమాస ప్రత్యేక పూజలు.. 108 రకాల నైవేద్యాల సమర్పణ!
Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అధికమాసం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు.
Peddapalli: కన్యకా పరమేశ్వరి ఆలయంలో అధికమాస ప్రత్యేక పూజలు.. 108 రకాల నైవేద్యాల సమర్పణ!
మంథని (పెద్దపల్లి జిల్లా): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అధికమాసం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి 33 రకాల తీరక్కలు, 108 రకాల నైవేద్యాలతో ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. ఆలయంలో భక్తి వాతావరణం నెలకొనగా, మహిళలు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
మహిళలు మాట్లాడుతూ, అధికమాసంలో చేసిన పూజలు, దానధర్మాలు, నైవేద్య సమర్పణలకు అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. 33 కోట్ల దేవతలను స్మరిస్తూ 33 రకాల ప్రసాదాలు, 108 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించినట్లు వివరించారు.
Next Story




