Peddapalli: పెద్దపల్లి జిల్లాలో వర్షాల కోసం మహిళల వినూత్న పూజలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ పెద్ద పోచమ్మ అమ్మవారికి మహిళలు 108 బిందెల నీటితో మహా జలాభిషేకం నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 16 July 2026 12:44 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో వర్షాల కోసం మహిళల వినూత్న పూజలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడలో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మహిళలు పెద్ద పోచమ్మ అమ్మవారికి 108 బిందెల నీటితో జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. పెద్ద పోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

అనంతరం 108 బిందెల పవిత్ర జలాలతో పెద్ద పోచమ్మ అమ్మవారికి మహా జలాభిషేకం నిర్వహించారు. భక్తి పారవశ్యంలో అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మహిళలు కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, వాగులు, నదులు నిండుకుండలా మారాలని, రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని మనసారా ప్రార్థించారు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, పిల్లలు విద్యలో రాణించాలని,

గ్రామ ప్రజలందరూ ఆనందంగా జీవించాలని మహిళలు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ మూసుకుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు లైసెట్టి రజిత రాజు, జంబోజు సమ్మయ్య తో పాటు తదితరులు ఉన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story