Manthani: సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అనారోగ్యంతో నిమ్స్‌లో కన్నుమూశారు. 20 రోజుల క్రితమే తండ్రి మరణించగా, కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
Manthani: సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత!
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంత సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మంథని జర్నలిస్ట్ వర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామ్ కుమార్ తండ్రి అనారోగ్యంతో చనిపోయి 20 రోజులు అవుతుంది.
ఈరోజు రామ్ కుమార్ చనిపోవడంతో వారి కుటుంబంలో విషాచాలు అనుముకున్నాయి. పెండ్యాల రామ్ కుమార్ విద్యార్థి దశ నుంచే అనేక సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. అనంతరం సుదీర్ఘ కాలం పాటు మంథని కేంద్రంగా జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చొరవ చూపారు.
పేద ప్రజల గొంతుకగా, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలను తెలియజేయడంలో ఆయన ముందుండేవారు. సామాజిక స్పృహ, నిజాయితీ, నిర్భయ జర్నలిజం ఆయన ప్రత్యేకత. మంథనిలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ప్రజా సమస్యల పోరాటాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు.
మంథని నియోజకవర్గం లోని జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.




