Peddapalli: పెద్దపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.. కనీస వేతనం డిమాండ్

Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా; కనీస వేతనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్, తాండ్ర సదానందం మద్దతు.

RAJU, PEDDAPALLI
Published on: 21 Nov 2026 11:55 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.. కనీస వేతనం డిమాండ్

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వామపక్ష నాయకులు తాండ్ర సదానందం కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాలు నిర్వహిస్తూ తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI