Peddapalli: : ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు మంత్రి హోదా!

Peddapalli: విజయ రమణారావుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం పట్ల కాల్వశ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 21 July 2026 10:47 PM IST
Peddapalli
X

Peddapalli: : ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు మంత్రి హోదా!

పెద్దపల్లి: పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం పట్ల పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మండల కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయరమణారావు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న విజ్జన్న సేవలను గుర్తించి మంత్రి హోదా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు గాజనవేన సదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి మాజీ సర్పంచ్ మదాసి సతీష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, సర్పంచులు అరెల్లి రమేష్, జిన్న రామచంద్రారెడ్డి, మోహన్ సహా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story