Peddapalli: సుల్తానాబాద్‌లో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన
Peddapalli: పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.
Peddapalli: సుల్తానాబాద్‌లో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన
Peddapalli: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో బుధవారం రోజున 12వ వార్డులో శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఒకటవ వార్డు సుగ్లాంపల్లిలో మున్సిపల్ ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ..
సుల్తానాబాద్ మున్సిపల్ ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగానే వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణంతో పాటు రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీరాంపూర్ రోడ్డును ఆధునికరించి సెంటర్ లైటింగ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగు నెలల కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వివరించారు. 1,2,13,14,15 వార్డులలో పనులు మొదటి విడతలో శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలు విశ్వాసం ఉంచి 15 వార్డులలో 13 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులను ఘనవిజయంతో గెలిపించడం జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు.
మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల కల్పన, మహిళలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, మహిళా సంఘ సభ్యులు వార్డుల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు మరియు పలువురు పాల్గొన్నారు.




