Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలు
Peddapalli: పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి, అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణారావు.
Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలు
పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలు పట్టణంలోని జెండా చౌరస్తాలో ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొడ్డుపల్లి సంపత్ మాట్లాడుతూ... ప్రజా నేత, జన హృదయ నేత, అభివృద్ధి ప్రదాత చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరోసారి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




