Peddapalli: పెద్దపల్లిలో వైభవంగా ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండలం శివపల్లిలో వైభవంగా నిర్వహణ. భారీగా తరలివచ్చిన నాయకులు, అభిమానులు.

KONDAL, SULTANABAD
Published on: 8 Nov 2026 6:11 AM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో వైభవంగా ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి నియోజకవర్గంలో మిన్నంటిన సంబరాలు వైభవంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండలం శివపల్లి గ్రామంలోని వారి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు పెద్ద ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

​అభిమానుల కోలాహలం, ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్యే విజయరమణారావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, కార్యకర్తల ప్రేమానురాగాలే తన బలమని, పెద్దపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు ఆయనకు పూలమాలలు, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD