Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే విజయరమణారావు బర్త్‌డే క్రికెట్ టోర్నీ

Peddapalli: ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదినం సందర్భంగా పెద్దపల్లిలో క్రికెట్ టోర్నమెంట్. టాస్ వేసి, బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు.

RAJU, PEDDAPALLI
Published on: 8 Nov 2026 4:45 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే విజయరమణారావు బర్త్‌డే క్రికెట్ టోర్నీ

పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రె నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ కు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, టాస్ వేసి, క్రికెట్ ఆడి టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కర్రె నరేష్ మాట్లాడుతూ... పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

యువతకు ఆదర్శం ఎమ్మెల్యే విజయరమణారావు అని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI