Peddapalli: కేరళలో జాతీయ పీఏసీ సదస్సు: ఎమ్మెల్సీ భాను ప్రసాద్ హాజరు!

Peddapalli: కేరళ అసెంబ్లీలో ప్రారంభమైన అఖిల భారత పీఏసీ సదస్సుకు పెద్దపల్లికి చెందిన సీనియర్ ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ రావు, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ బృందం హాజరైంది.

RAJU, PEDDAPALLI
Published on: 4 Nov 2026 5:41 PM IST
Peddapalli
X

Peddapalli: కేరళలో జాతీయ పీఏసీ సదస్సు: ఎమ్మెల్సీ భాను ప్రసాద్ హాజరు!

పెద్దపల్లి: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కేరళ శాసనసభ భవనంలో పార్లమెంట్, వివిధ రాష్ట్రాల శాసనసభల పబ్లిక్ అకౌంట్స్ కమిటీల (PAC) చైర్మన్ల అఖిల భారత సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ జాతీయ స్థాయి సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు తెలంగాణ సీనియర్ ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ రావు, తెలంగాణ శాసనమండలి కార్యదర్శి వి. నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి హాజరయ్యారు.

పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కె.సి. వేణుగోపాల్ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల శాసనసభలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో ఆర్థిక జవాబుదారీతనం, ప్రభుత్వ ఖర్చులపై ఆడిట్ విధానాలు, ప్రజాధనం సక్రమ వినియోగంపై శాసనసభల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రజాధన వినియోగంలో పారదర్శకతను పెంపొందించడం, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI