Dharmaram: ధర్మారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం!

Dharmaram: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధర్మారంలో ఎంపీ లాడ్స్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

RAMESH, DHARMPURI
Published on: 18 July 2026 1:11 PM IST
Dharmaram
X

Dharmaram: ధర్మారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం!

Dharmaram: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పర్యటించారు.మండల కేంద్రంలో ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేవుడుపేరు చెప్పి రాజకీయం చేస్తున్నారు. అయోధ్య రామాలయంలో రూ 250 కోట్ల దొంగతనం పై మోడి ఎందుకు మాట్లాడడం లేదు. ఇతర పార్టీల ఎంపీలపై ఈడీ కేసులు పెట్టీ బెదిరించడం కొనడం ద్వారా బిజెపి అనుకూల జీవోలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నెగ్గాలనుకుంటున్నరని ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలిపిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడే సూర్యనారాయణ,కొడారి హనుమయ్య, పాలకుర్తి రాజేశం గౌడ్ దేవి లావణ్య పాలకుర్తి రేణుకతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story