Peddapalli: పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ బుక్కైన అధికారి!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సంచలన దాడి చేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 14 July 2026 11:12 AM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ బుక్కైన అధికారి!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుండి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఏఈ సతీష్ ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంతరం విచారణ కోసం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story