Peddapalli: పెద్దపల్లిలో హోరెత్తుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె!
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె హోరెత్తుతోంది. తమను రెగ్యులర్ చేయాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు.
Peddapalli: పెద్దపల్లిలో హోరెత్తుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె!
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె హోరెత్తుతోంది. తెలంగాణ రాష్ట్ర NHM JAC పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీ నుండి చేపట్టిన ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడింది తామేనని, గ్రామీణ ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి వైద్య సేవలు అందించామని తెలిపారు. అలాంటి తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన హక్కుల సాధనే లక్ష్యంగా, ఐక్యతే తమ బలంగా సమ్మె చేస్తున్నామని నినదించారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత కల్పించాలని, కనీస వేతనం చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




