Peddapalli: ఓదెల నూతన తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ బాధ్యతల స్వీకరణ!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల నూతన తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

KONDAL, SULTANABAD
Published on: 26 Oct 2026 6:05 PM IST
Peddapalli
X

Peddapalli: ఓదెల నూతన తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ బాధ్యతల స్వీకరణ!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఓదెల నూతన తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ​ఇంతవరకు మండలంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌కు బదిలీపై వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఓదెల మండల నాయబ్ తహసీల్దార్‌గా సేవనందిస్తున్న మహమ్మద్ షఫీ తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ​ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

నూతన తహసీల్దార్‌ను కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు సర్పంచులు, స్థానిక పాత్రికేయ మిత్రులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో గిర్దావర్ చంద్ర మోహన్, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, ఎంపీఎస్ఓ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD