Peddapalli: ఓదెలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తి.. మహిళ సేఫ్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఆర్టీసీ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు.
Peddapalli: ఓదెలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తి.. మహిళ సేఫ్!
ఓదెల (పెద్దపల్లి జిల్లా): పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఆర్టీసీ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తూ ఆకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలిన ఓ మహిళను సకాలంలో స్పందించి రక్షించారు.
మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్ర నిరోషా (30) అనే మహిళ తన అత్తగారి ఇల్లు మద్దికుంట నుండి తల్లిగారి ఊరైన ఓదెలకు బస్సులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. సాయంత్రం సమయంలో ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో బస్సు సీట్లోనే స్పృహ తప్పి పడిపోయింది.
దీనిని గమనించిన బస్సు డ్రైవర్ రాజు, కండక్టర్ సుమన్ వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సును హుటాహుటిన ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్‌కు తీసుకొచ్చారు.
స్వయంగా మహిళను అంబులెన్స్ ఎక్కించి, శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లను ప్రయాణికులు, స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. డ్రైవర్, కండక్టర్‌లను ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ శాలువాలతో సన్మానించి ఇరువురిని అభినందించారు




