Peddapalli: పెద్దపల్లిలో ఆయిల్ మిల్ గోడ కూలి ప్రమాదం!
Peddapalli: పెద్దపల్లి మండలం సబితం గ్రామంలో శ్రీ పరమేశ్వర ఆయిల్ మిల్ గోడ కూలి తీవ్ర నష్టం వాటిల్లింది.
Peddapalli: పెద్దపల్లిలో ఆయిల్ మిల్ గోడ కూలి ప్రమాదం!
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి మండలం సబితం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ పరమేశ్వర ఆయిల్ మిల్ గోడ కూలి ప్రమాదం జరిగింది. ఆయిల్ మిల్ యజమాని నిర్లక్ష్యం వల్ల కూలిన గోడ శిథిలాలు రెండు విద్యుత్ స్తంభాలపై పడటంతో స్తంభాలు విరిగిపోయాయి.
అంతేకాకుండా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి మొత్తం ఇటుకలు, శిథిలాలు పడిపోయి బావి పూడిపోయింది. దీంతో ఆ బావిపై ఆధారపడిన రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ప్రమాదం జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా స్థలానికి యజమాని రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత రైతులు వెంటనే అధికారులు స్పందించి బావిలోని శిథిలాలు తొలగించి, విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించి, తమ పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.




