Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి ప్రారంభించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 1 Nov 2026 12:35 PM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!

Peddapalli: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి కోరారు.

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేట, లక్ష్మీపురం, పందిళ్ళ, ఆరెపల్లి, ఇప్పలపల్లి,మల్యాల, తారుపల్లి,మొట్లపల్లి, చిన్నరాతపల్లి, పెద్దరాతపల్లి, కిష్టంపేట, మిర్జంపేట తదితర గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులతో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు మండలవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ మద్దతు ధర ₹2,461కి తోడుగా ప్రభుత్వం ఇస్తున్న ₹500 బోనస్‌ను కలిపి, మొత్తం క్వింటాల్‌కి ₹2,961 ధరను రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు.

రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, శుభ్రపరచి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రతీ బస్తాకు ఎలాంటి కటింగ్లు లేకుండా పారదర్శకంగా 41 కిలోల తూకం వేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాలుకు 8 నుండి 20 కిలోల వరకు తరుగు పేరిట కోత విధించి రైతులను ఇబ్బంది పెట్టారని, ఎమ్మెల్యే విజయరమణారావు చొరవతో రైస్ మిల్లర్లను ఒప్పించి రైతులకు ఎలాంటి కట్టింగ్ లేకుండా గత మూడు సంవత్సరాలుగా కొనుగోలు పక్రియ నిర్వహిస్తున్నారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో ఎల్ నియో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున ఆయకట్టుకు సాగునీరు అందడం కష్టంగా మారిందని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు సూచనల మేరకు రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అరతడి (స్వల్పకాలిక) ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కోరారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను ప్రతిరోజూ 10 నుండి 12 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ సంధ్య వెంకట్ రెడ్డి, సీఈఓ కొల్లేటి శ్రీనివాస్ ఆయా గ్రామర సర్పంచులు ప్రజా ప్రతినిధులు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli