Peddapalli: చివరి గింజ వరకు వరి కొనుగోలు.. విప్ విజయ రమణారావు
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కటింగ్ లేకుండా చివరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు.
Peddapalli: చివరి గింజ వరకు వరి కొనుగోలు.. విప్ విజయ రమణారావు
Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు మీడియాతో మాట్లాడారు. ఈ సీజన్‌లో కటింగ్ లేకుండా చివరి గింజ వరకు వరి పంటను కొనుగోలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి ఆటలు సాగలేదని విమర్శించారు.
వివరాలు - విజయ రమణారావు కామెంట్స్:
ఈ సీజన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో వరి, మొక్కజొన్నలు పండాయని, వాటిని విజయవంతంగా కొనుగోలు చేశామని విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో గతంలో కంటే 29 వేల మెట్రిక్ టన్నుల అదనపు పంట దిగుబడి వచ్చిందన్నారు.
మొత్తం 4 లక్షల 29 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి, 329 మంది రైతులకు 920 కోట్ల రూపాయల నగదు చెల్లించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా వడ్లు, మక్కలు కొనుగోలు చేశామని చెప్పారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, కానీ వారి ఆటలు ఎక్కడా సాగలేదని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతుల వడ్లకు కటింగ్ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చివరి గింజ వరకు కటింగ్ లేకుండా కొనుగోలు చేసిందని అన్నారు.




