Peddapalli: మానేరు వాగులో గల్లంతై పంచాయతీ కార్యదర్శి మృతి

Peddapalli: పెద్దపల్లి ఓడేడు మానేరు వాగులో ప్రమాదవశాత్తు మునిగి పంచాయతీ కార్యదర్శి జయపాల్ మృతి. భార్యను కాపాడిన స్థానికులు. ముత్తారం పోలీసుల దర్యాప్తు.

SHANKAR, MANTHANI
Published on: 23 Oct 2026 7:21 PM IST
Peddapalli
X

Peddapalli: మానేరు వాగులో గల్లంతై పంచాయతీ కార్యదర్శి మృతి

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామ శివారులోని మానేరు నది వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన శానిగరపు జయపాల్ (32) తన భార్య శ్రుతి, కుమార్తెతో కలిసి అత్తగారి గ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం నుండి స్వగ్రామమైనా రత్నాపూర్ గ్రామానికి తిరిగి వస్తుండగా ఓడేడు శివారులోని మానేరు నది వద్ద ఆగారు.

ఈ క్రమంలో జయపాల్ నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య శ్రుతి సైతం నీటిలో మునిగిపోతుండగా, అక్కడే ఉన్న ఈశ్వర్ అనే వ్యక్తి వారిని రక్షించేందుకు ప్రయత్నించి బయటకు తీశాడు.

అయితే అప్పటికే జయపాల్ మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న శ్రుతిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గోదారి పని తరలించారు. జైపాల్ మంథని మండలం సూరయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI