Manthani: మంథనిలో గుడుంబా డంప్‌పై దాడి, 2వేల లీటర్ల పానకం ధ్వంసం!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని శివారులో గుడుంబా తయారీకి ఉంచిన 2వేల లీటర్ల బెల్లం పానకాన్ని సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు.
Manthani: మంథనిలో గుడుంబా డంప్‌పై దాడి, 2వేల లీటర్ల పానకం ధ్వంసం!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అక్రమంగా గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో మంథని పోలీసులు దాడి నిర్వహించారు. సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడిలో ప్లాస్టిక్ క్యాన్లు, డ్రమ్ముల్లో నిల్వ చేసిన సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించారు.
పంచుల సమక్షంలో పానకాన్ని స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గుడుంబాను డంప్ చేసిన లేదా అక్రమంగా తయారు చేసి నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్రమ గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బుద్దె స్వామి హెచ్చరించారు. గుడుంబా ఆరోగ్యానికి తీవ్ర హానికరమని, ప్రాణనష్టానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు. గుడుంబా తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, రమేష్ రావు, కానిస్టేబుళ్లు శివ, అజిత్, సతీష్, అంజి పాల్గొన్నారు.




