Peddapalli: రూ. 2.44 కోట్లతో పెద్దరతూపల్లి సబ్ స్టేషన్ మంజూరు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరతూపల్లికి రూ.2.44 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది.

Srimanthula Kondal, Peddapalli
Published on: 25 Sept 2026 6:01 PM IST
Peddapalli
X

Peddapalli: రూ. 2.44 కోట్లతో పెద్దరతూపల్లి సబ్ స్టేషన్ మంజూరు!

కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరతూపల్లి గ్రామానికి రూ. 2.44 కోట్ల అంచనా వ్యయంతో నూతన 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైనట్లు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గాజనమైన సదయ్య తెలిపారు. సబ్ స్టేషన్ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో పెద్దరాతపల్లి ప్రాంతంలో నెలకొన్న లో-వోల్టేజ్, కరెంట్ ట్రిప్పింగ్ సమస్యలను ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి సబ్ స్టేషన్ మంజూరు చేయించారని వెల్లడించారు. పెద్దరతూపల్లితో పాటు ఎదులాపూర్, చిన్నరాత్‌పల్లి ప్రాంతాల రైతులకు, ప్రజలకు ఈ సబ్ స్టేషన్‌తో విద్యుత్ సమస్యలు శాశ్వతంగా తీరుతాయన్నారు. నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థానిక తహసీల్దార్ ప్రభుత్వ భూమిని కూడా కేటాయించారని తెలిపారు.

​అలాగే నియోజకవర్గంలో పెద్దరతూపల్లితో పాటు రూప్‌నారాయణపేట, ధూళికట్ట, సుల్తానాబాద్ శాస్త్రీనగర్‌లలో కూడా సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కంకణబద్ధులై పనిచేస్తున్నారని.. బూరుగుపల్లె - ఎదులాపూర్ రోడ్డుకు రూ. 30 కోట్లు, గర్రెపల్లి - పెగడపల్లి రోడ్డుకు రూ. 100 కోట్లు మంజూరు చేయించడంతో పాటు శ్రీరాంపూర్ హెడ్‌క్వార్టర్‌లో డబుల్ రోడ్డు, సెంటర్ లైటింగ్ పనులు వేగవంతం చేశారని తెలిపారు.

త్వరలోనే శ్రీరాంపూర్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి కూడా నిధులు మంజూరు కానున్నాయని చెప్పారు.​ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ సర్పంచ్ లు బంగారి రమేష్ జిన్నా రామచంద్రం రెడ్డి నాయకులు ఓరుగంటి కొమురయ్య, సబ్బని రాజమల్లు, రావి సదానందం మాదాసి సతీష్ గోలి సుధాకర్ మేడి అశోక్, పాల రాజేశం మొగిలి సదానందం అటకం శంకరయ్య ధ్యాగేటి రామచంద్రం అనిల్ తదితరులు ఉన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli