Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లిలో వైభవంగా సదర్ ఉత్సవాలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామంలో ఘనంగా సదర్ ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకులు గంట రాములు యాదవ్.

Srimanthula Kondal, Peddapalli
Published on: 10 Nov 2026 9:58 AM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లిలో వైభవంగా సదర్ ఉత్సవాలు!

Peddapalli: యాదవులను ఐక్యంగా ఉంచడంతో పాటు వారిలో సోదరభావం, ఐకమత్యాన్ని పెంపొందించేందుకు సదర్ ఉత్సవాలు దోహదపడుతున్నాయని అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఓదెల మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల ప్రదర్శన, ఊరేగింపు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామ యువకులు, యాదవ సోదరులు ఒగ్గు కళాకారుల డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక నృత్యాలతో వీధులను హోరెత్తించారు.​

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకులు, ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ మాట్లాడుతూ.. యాదవులను ఏకం చేయడంతో పాటు వారిలో సోదరభావం, ఐకమత్యాన్ని పెంపొందించేందుకు సదర్ ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పెగడపల్లి గ్రామం ఎప్పుడూ చైతన్యానికి, సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుందని, హైదరాబాద్,జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సదరు ఉత్సవాలను పెగడపల్లి గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.​ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలి.

​శ్రీకృష్ణుని వంశానికి చెందిన యాదవులు సమాజంలో ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించడంలో ముందుండాలని గంట రాములు యాదవ్ పిలుపునిచ్చారు.​స రాబోయే రోజుల్లో యాదవులు సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతూ చట్టసభల్లో సైతం సముచిత స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.​ఈ ఉత్సవాల్లో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందవేన రాజేందర్, యాదవ ట్రస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ కొమురయ్య, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సదరు కమిటీ అధ్యక్షులు చిన్న నాయకులు గాజవేన సదయ్య, అల్లం దేవేందర్, అరుకుటి పకీర్ నరసింహులు, నక్కల రాజమల్లు, తాత రాజు, పెంట రవి, అల్లం సదయ్య, నక్కల కొమురయ్య, నూనెటి కుమార్, పెంట సతీష్, కూకట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli