Kalva Srirampur: ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు సర్పంచ్ తుల మనోహర్ రావు
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో గ్రామసభ. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సర్పంచ్ తుల మనోహర్ రావు పిలుపు.
Kalva Srirampur: ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు సర్పంచ్ తుల మనోహర్ రావు
కాల్వ శ్రీరాంపూర్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మొట్లపల్లి సర్పంచ్ తుల మనోహర్ రావు పిలుపునిచ్చారు.
గురువారం మొట్లపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ మాట్లాడారు. ఇళ్లలోని వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రాంజీ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకుంటే భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో రవాణా:
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సర్పంచ్ కోరారు. బడికి వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. సమావేశం అనంతరం గ్రామంలో 'తల్లిపాల వారోత్సవాలు' ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మల సుమలత సదయ్య, పంచాయతీ కార్యదర్శి మహేందర్, జీపీఓ కాసర్ల స్వాతి, ప్రధానోపాధ్యాయులు పులి శ్రీనివాస్ రెడ్డి, రాజమౌళి, ఏఎల్ఎం వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్, అంగన్వాడీ టీచర్లు సుజాత, భారతి మరియు వార్డు సభ్యులు బెజ్జాల సంపత్, రాందేని రాజేశం, అనుముల రమేష్, దొమ్మటి శంకరమ్మ, గాదర్ల శారద, బెజ్జాల మానస, దొమ్మటి పోషాలు తదితరులు పాల్గొన్నారు.




