Peddapalli: ఓదెల మండల సమావేశంలో తాసిల్దార్ తీరుపై సర్పంచుల నిరసన!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల సర్వసభ్య సమావేశంలో తాసిల్దార్ వనజ నాయక్ వైఖరిపై సర్పంచుల నిరసన.. క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిన వివాదం.

Srimanthula Kondal, Peddapalli
Published on: 19 Sept 2026 3:49 PM IST
Peddapalli
X

Peddapalli: ఓదెల మండల సమావేశంలో తాసిల్దార్ తీరుపై సర్పంచుల నిరసన!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తాసిల్దార్ వనజ నాయక్ వైఖరిపై సర్పంచులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన లంబాడి తండా సర్పంచ్ గుగులోతు నిమ్మ నాయక్‌ను ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా బయటికి వెళ్ళండి "గెట్ అవుట్" అంటూ అగౌరవపరిచారని సర్పంచ్ ఆరోపించారు.

​ఈ విషయమై సర్వసభ్య సమావేశంలో సర్పంచులు తాసిల్దార్ తీరును ఎండగడుతూ ఆందోళనకు దిగారు. తాసిల్దార్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచుల నిరసనతో స్పందించిన తాసిల్దార్ వనజ నాయక్, సర్పంచ్ గుగులోతు నిమ్మ నాయక్‌కు క్షమాపణ (సారీ) చెప్పడంతో వివాదం శాంతించింది. దీంతో సర్పంచులు తమ నిరసనను విరమించారు. ఇప్పటికైనా తాసిల్దార్ తమ తీరును మార్చుకోవాలని ఈ సందర్భంగా సర్పంచులు స్పష్టం చేశారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli