Peddapalli: పెద్దపల్లిలో రైస్ మిల్లు తనిఖీ, పీడీఎస్ బియ్యం కలకలం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి 18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు.

RAMESH, DHARMPURI
Published on: 9 Oct 2026 6:10 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో రైస్ మిల్లు తనిఖీ, పీడీఎస్ బియ్యం కలకలం!

Peddapalli: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసి నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని ఈరోజు పక్కా సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ డిప్యూటీ తహసీల్దార్ పోచయ్య.. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి... ధర్మారం పోలీసుల మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు... రైస్ మిల్లులో తనిఖీలలో రీ సైక్లింగ్ చేసి నిల్వ ఉంచిన 18 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పట్టుకుని సీజ్ చేశారు.... ఈ సందర్భంగా జిల్లా టాస్క్ ఫోర్స్ డిప్యూటీ తహసిల్దార్ పోచయ్య మీడియాతో మాట్లాడుతూ... అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ రీ సైక్లింగ్ చేసి నిల్వ చేసినట్లు గుర్తించామని.... బియ్యం సీజ్ చేశామని...పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు....

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI