Peddapalli: సేవా స్ఫూర్తితో మల్క యశస్వి జన్మదిన వేడుకలు
Peddapalli: పెద్దపల్లిలో మల్క యశస్వి జన్మదిన వేడుకలు; బస్టాండ్ వద్ద స్వీట్ల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, సహాయకులకు అన్నదానం, పండ్ల పంపిణీ.
Peddapalli: సేవా స్ఫూర్తితో మల్క యశస్వి జన్మదిన వేడుకలు
పెద్దపల్లి: బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీజీఓఎస్ & డీపీఎస్ స్కూల్ సీఈఓ మల్క యశస్వి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలో టీమ్ మల్క ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు అన్నదానం నిర్వహించడంతో పాటు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టీమ్ మల్క సభ్యులు మాట్లాడుతూ, జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత సమాజ సేవలో ముందుండాలని, పేదలు, నిరుపేదలు, రోగులకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమాల్లో టీమ్ మల్క సభ్యులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.




