Peddapalli: పెద్దపల్లిలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు సవాల్.. చర్చకు సిద్ధమా అంటూ ప్రతిపక్షాలకు లెంకలు!

Peddapalli: పెద్దపల్లి నందన గార్డెన్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై మండిపాటు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్.

RAJU, PEDDAPALLI
Published on: 8 Jun 2026 3:30 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు సవాల్.. చర్చకు సిద్ధమా అంటూ ప్రతిపక్షాలకు లెంకలు!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు రాజకీయ పార్టీలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు స్పందించిన ఆయన, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి సదుపాయాలు, పంటల కొనుగోలు, మద్దతు ధరల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక అబద్ధాల ప్రచారానికి తెర లేపాయని విమర్శించారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వాస్తవాలను గుర్తించే స్థాయిలో ఉన్నారని, తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

గత ప్రభుత్వాల పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story