Sultanabad: సుల్తానాబాద్‌లో ఇందిరమ్మ బీమా ఆన్లైన్ విధానం ప్రారంభం
Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఇందిరమ్మ బీమా, గృహ ప్రవేశం, ఖోఖో పోటీలు ప్రారంభించిన విప్ విజయరమణ రావు; రూ.8.30 కోట్లతో పబ్లిక్ స్కూల్ వెల్లడి.
Sultanabad: సుల్తానాబాద్‌లో ఇందిరమ్మ బీమా ఆన్లైన్ విధానం ప్రారంభం
సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ బీమా పథకం ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్థానిక నేతలతో కలిసి బీమా పోస్టర్లను ఆవిష్కరించి ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం సుల్తానాబాద్ పట్టణంలోని 10 వ వార్డులో ఇందిరమ్మ గృహాన్ని లబ్ధిదారుల ఆహ్వానం మేరకు నూతన గృహాన్ని ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఆవిష్కరించారు. తదుపరి సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో కోకో క్రీడల పోటీలను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా పథకం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపు ఆలోచనతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ బీమా పథకాన్ని బుధవారం సిద్దిపేటలో ప్రారంభించారని ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని ఇంటి పెద్ద దురదృష్టవశాత్తు మృతి చెందితే ఈ బీమా వర్తిస్తుందని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బీమా వర్తిస్తుందని ఎలాంటి షరతులు లేకుండా పథకాన్ని ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అప్పటి నుండి గత ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలుపరచని వాటిని కూడా నేడు వాటిని ప్రజల కళ్ళముందు ప్రత్యక్షంగా అమలు పరిచి చూపిస్తున్నారని గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేకపోయిందని డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో కానీ రేషన్ కార్డులలో ప్రజలకు మొండి చేయి చూపించిందని వివరించారు.
మరో నాలుగైదు రోజులలో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రూ.8.30 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు భూమి పూజ చేయనున్నట్లు వివరించారు. చదువుకునే విద్యార్థులకు చక్కటి మెరుగైన విద్యను అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు బిరుదు రాధాకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,మునిసిపల్ వైస్ చేర్మెన్,సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ టి రమేష్ పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో మహిళలు పలువురు పాల్గొన్నారు.




