Sircilla: సిరిసిల్లలో పెను ప్రమాదం ఇండ్లపై పడ్డ 33 కేవీ హైటెన్షన్ వైరు

Sircilla: రాజన్న సిరిసిల్ల పెద్దూరు బస్టాండ్ సమీపంలో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి ఇండ్లపై పడింది గృహోపకరణాలు కాలిపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

KALEEM, SIRICILLA
Published on: 3 July 2026 11:19 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో పెను ప్రమాదం ఇండ్లపై పడ్డ 33 కేవీ హైటెన్షన్ వైరు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు బస్టాండ్ సమీపంలో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడి ఇండ్లపై పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు బస్టాండ్ సమీపంలో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరు ఒక్కసారిగా తెగిపడి ఇండ్లపై పడింది. భారీ శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

ఈ ఘటనలో పలు ఇళ్లలో విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, స్విచ్ బోర్డులు కాలిపోవడంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

గతంలో కూడా ఇదే వైరు తెగిందని, అప్పట్లో అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వైరు తెగిన సమయంలో సమీపంలో చిన్నారులు ఆడుకుంటుండటంతో పెను ప్రమాదం తృటిలో తప్పిందని కాలనీవాసులు చెబుతున్నారు.

ఇండ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను వెంటనే తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story