Pegadapalli: పెగడపల్లిలో క్షుద్ర పూజల కలకలం మడేల్లయ్య స్వామి గుడిలో భయాందోళన!
Pegadapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి మడేల్లయ్య స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తుల క్షుద్ర పూజలు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదు.
Pegadapalli: పెగడపల్లిలో క్షుద్ర పూజల కలకలం మడేల్లయ్య స్వామి గుడిలో భయాందోళన!
Pegadapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పెగడపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ఉన్న రజక సంఘం మడేల్లయ్య స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది.ఆలయ ప్రాంగణంలోని జిల్లేడు చెట్టుకు ఒక బొమ్మను కట్టి, పసుపు, కుంకుమలు చల్లి క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు, రజక సంఘం సభ్యులు గుర్తించారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కేవలం క్షుద్ర పూజలే కాకుండా, కొంతమంది ఆకతాయిలు ఆలయ ప్రాంగణాన్ని మద్యం తాగడానికి, పేకాట ఆడటానికి వేదికగా మార్చుకున్నారని రజక సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా, సంబంధిత వ్యక్తుల్లో ఎలాంటి మార్పు రాలేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
దేవుని ఆలయ పవిత్రతను భంగపరుస్తూ, గ్రామంలో భయాందోళనలు రేకెత్తిస్తున్న ఇలాంటి చర్యలపై పోలీస్లు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయానికి తగిన భద్రత కల్పించాలని రజక కులస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.




