Karimnagar: లైఫ్ సర్టిఫికెట్ పేరుతో సైబర్ మోసం: రూ.10.80 లక్షలు స్వాహా
Karimnagar: కరీంనగర్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అప్‌డేట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగి మురళీధర్‌రావు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.10.80 లక్షలు కాజేశారు.
Karimnagar: లైఫ్ సర్టిఫికెట్ పేరుతో సైబర్ మోసం: రూ.10.80 లక్షలు స్వాహా
కరీంనగర్: కరీంనగర్ లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నవీకరణ పేరుతో కరీంనగర్ చైతన్యపురి కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి మురళీధర్‌రావు ను (86) మోసగించారు.
ఈనెల 1న ఫోన్ చేసి వివరాలు సేకరించిన కేటుగాళ్లు.. 5వ తేదీ అర్ధరాత్రి ఆరు విడతల్లో ఆయన యూనియన్ బ్యాంక్ ఖాతాలోని రూ.10,80,000 ముంబయి, కోల్‌కతాల్లోని ఇతర ఖాతాలకు మళ్లించారు. ఉదయం డబ్బులు మాయమైనట్లు గుర్తించి బాధితుడు కంగుతిన్నారు.
బ్యాంకు అధికారుల సూచన మేరకు సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపరిచిత కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే వెంటనే '1930'కు ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచించారు.




