Sircilla: 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా పి.జె.పి.సి. ఛటర్జీ బాధ్యతలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్‌లోని 17వ టీజీఎస్పీ పోలీస్ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా పి.జె.పి.సి. ఛటర్జీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Sircilla: 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా పి.జె.పి.సి. ఛటర్జీ బాధ్యతలు
సిరిసిల్ల: 17వ పోలీస్ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా పి.జె.పి.సి. ఛటర్జీ బాధ్యతల స్వీకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్‌లోని 17వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు నూతన కమాండెంట్‌గా నియమితులైన పి.జె.పి.సి. ఛటర్జీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖలో కమాండెంట్‌గా విధులు నిర్వహించిన ఛటర్జీ సాధారణ బదిలీపై 17వ బెటాలియన్‌కు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కమాండెంట్ ఛటర్జీ మాట్లాడుతూ. బెటాలియన్‌లో క్రమశిక్షణ, సమర్థత, ప్రజాసేవకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి బెటాలియన్ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమైన కమాండెంట్. బెటాలియన్ నిర్వహణ, భద్రతా చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.




