Huzurabad: ఇప్పల్ నర్సింగాపూర్లో పొలంబడి: ఆరుతడి పంటల సాగుకు పిలుపు
Huzurabad: హుజురాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్లో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో పొలంబడి జరిగింది. ఎల్ నినో వేళ ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏడీఏ సునీత సూచించారు.
Huzurabad: ఇప్పల్ నర్సింగాపూర్లో పొలంబడి: ఆరుతడి పంటల సాగుకు పిలుపు
హుజరాబాద్: హుజరాబాద్ మండలంలోని ఈరోజు ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలోని రైతు గూడూరి స్వామి రెడ్డి(లోకసత్తా) వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ మరియు ఆత్మ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ డి ఏ సునీత గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు పండించాలని అదేవిధంగా నేలల సంరక్షణ కొరకు వరి కొయ్యకాలు కాల్చకుండా పొలంలోనే కలియదున్ని పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు మరియు సేంద్రియ కర్బనాన్ని నేలకు అందే విధంగా నేలను సంరక్షించాలని తెలుపుతూ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పండించాలని సూచించారు.
కె.వి.కె శాస్త్రవేత్త విజయ్ గారు మాట్లాడుతూ కేవలం వరి పంటపై ఆధారపడుతున్న రైతులు ఇతర పంటలైన నూనె గింజలు,పప్పు ధాన్యాలు,కూరగాయలు మరియు ఆయిల్ ఫామ్ పంటలు పండించి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు అని తెలుపుతూ పంటలు పండించే విషయంలో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఖర్చు తగ్గించుకుని ఎక్కువ దిగుబడి పొందే మార్గాలను శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎంచుకోవాలని తెలిపారు.
హుజురాబాద్ ఏవో భూమి రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట పండిస్తున్న రైతులు అంతర పంటగా సరివి, కూరగాయలు, చిరుధాన్యాలు వంటి పంటలు కూడా పండించి ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. జమ్మికుంట ఏవో ఖాదర్ హుస్సేన్ మాట్లాడుతూ భూసార పరీక్షల యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను వాడే విధానాన్ని రైతులకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గూడూరి స్వామి రెడ్డి(లోకసత్త )గారిని ఘనంగా సన్మానించారు
కార్యక్రమంలో ఏఈఓ నిఖిల్ కుమార్,ఆత్మ ఎటిఎం స్రవంతి మరియు రైతులు గూడూరి రాంరెడ్డి మాజీ ఎంపీటీసీ, గూడూరి మల్లారెడ్డి, మార్కా మొగిలి, పల్లె వీరయ్య మాజీ సర్పంచ్, గూడూరి చైతన్య రెడ్డి, కాటి పెళ్లి సంజీవరెడ్డి, మొదలగువారు పాల్గొన్నారు.




