Jagtial: పొలాస శివాలయంలో ఘనంగా శ్రావణ మాస శివరాత్రి వేడుకలు!
Jagtial: పొలాస శివాలయంలో శ్రావణ మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Jagtial: పొలాస శివాలయంలో ఘనంగా శ్రావణ మాస శివరాత్రి వేడుకలు!
Jagtial: జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని శివాలయంలో శ్రావణమాస మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నపూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ... శ్రావణమాసంలో చేసే శివారాధనకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. మాస శివరాత్రి నాడు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే మనశ్శాంతి లభిస్తుందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆ మహాదేవుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు కొత్త మోహన్, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




