Karimnagar: డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత నడుం బిగించాలి ఎస్సై క్రాంతికుమార్
Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Karimnagar: డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత నడుం బిగించాలి ఎస్సై క్రాంతికుమార్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మత్తుపదార్ధాల వ్యతిరేక, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు,ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు.
చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని, అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించార. యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన 1908 ద్వారా పోలీసులకు సమాచారం అందివాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




