Sircilla: రాజీవ్ నగర్‌లో పోలీసు తనిఖీలు 60 బైక్‌లు సీజ్!

Sircilla: సిరిసిల్ల రాజీవ్ నగర్‌లో ఎస్పీ ఆదేశాలతో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. సరైన పత్రాలు లేని 60 బైక్‌లు, అక్రమ మద్యం సీజ్.

KALEEM, SIRICILLA
Published on: 25 July 2026 9:24 AM IST
Sircilla
X

Sircilla: రాజీవ్ నగర్‌లో పోలీసు తనిఖీలు 60 బైక్‌లు సీజ్!

Sircilla: రాజీవ్ నగర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. 60 ద్విచక్ర వాహనాలు సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని తెలిపారు. వాహనదారులు సరైన పత్రాలు, నిబంధనలకు అనుగుణమైన నంబర్ ప్లేట్లతోనే వాహనాలు నడపాలని సూచించారు.

అనంతరం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని సుమారు 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ బెల్ట్ షాప్‌పై దాడి చేసి మద్యాన్ని సీజ్ చేశారు.

నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story