Karimnagar: ఇందుర్తిలో కార్డన్ అండ్ సెర్చ్.. సైబర్ నేరాలపై ప్రజలకు ఏసీపీ అవగాహన!

Karimnagar: ఇందుర్తి గ్రామంలో రూరల్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తూ, సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

SRINIVAS, HUSNABAD
Published on: 6 Nov 2026 10:47 AM IST
Karimnagar
X

Karimnagar: ఇందుర్తిలో కార్డన్ అండ్ సెర్చ్.. సైబర్ నేరాలపై ప్రజలకు ఏసీపీ అవగాహన!

Karimnagar: కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో, తిమ్మాపూర్ సీఐ మరియు కొత్తపల్లి CI, చిగురుమామిడి ఎస్‌ఐ సిబ్బందితో కలిసి ఇందుర్తి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, మహిళలపై జరిగే నేరాల నివారణ, అక్రమ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండటం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది గ్రామ ప్రజలు హాజరయ్యారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD