Sircilla: సిరిసిల్లలో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన!
Sircilla: సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యం భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
Sircilla: సిరిసిల్లలో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన!
Sircilla: రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్, వీ.బీ. కమలాసన్ రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్) ఓఎస్‌డీ, ఐఎస్‌డబ్ల్యూ డైరెక్టర్, టీజీఐసీసీసీ, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో పోలీస్ అధికారులు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూట్ క్లియరెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలు, బారికేడ్ల ఏర్పాటు తదితర భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. పర్యటనకు సంబంధించిన భద్రతా విధుల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.




