Sircilla: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ మహేష్ బి. గితే

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు 'సురక్షక తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ' ర్యాలీ నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Aug 2026 12:28 PM IST
Sircilla
X

Sircilla: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ మహేష్ బి. గితే

Sircilla: సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన.. సిరిసిల్లలో ‘సురక్షక తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ’ ర్యాలీ

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య మాసోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "సురక్షక తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ" కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు వివిధ కళాశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ పోలీసులు విద్యార్థులకు సైబర్ మోసాలు, ఏపీకే (APK) యాప్‌లు, ఓటీపీ మోసాలు, ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మీడియా సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా చురుకుగా ఉంటున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ హెచ్చరించారు. ఆధార్ నంబర్లు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, సోషల్ మీడియా ఖాతాలకు భద్రతా సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story