Ramagundam: రామగుండం పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు పూర్తి!
Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా వి. నవీన్ కుమార్ ఎన్నికయ్యారు.
Ramagundam: రామగుండం పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు పూర్తి!
రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ కె.శ్రీనివాస్,ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగేంద్ర గౌడ్,రమేష్,ఏఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ భీమేష్,ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్నికల ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారి, ఎన్నికల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ ఎన్నికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 70 మంది పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వడ్లకొండ నవీన్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాంచందర్‌పై 5 ఓట్ల ఆధిక్యంతో రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు: వి. నవీన్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ 291, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్
ఉపాధ్యక్షులు: ఎన్. శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్, సైబర్ క్రైమ్ విభాగం; ఎం. తిరుపతి, ఏఎస్ఐ, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్
ప్రధాన కార్యదర్శి: జె. అంజనేయులు, సబ్‌ఇన్‌స్పెక్టర్, సీసీబీ రామగుండం
సంయుక్త కార్యదర్శి: కె. ఓంకార్, కానిస్టేబుల్, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్
సంస్థాగత కార్యదర్శి: డి. వినోద్ బాబు, కానిస్టేబుల్, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్
కోశాధికారి: టి. సుందర్ సింగ్, కానిస్టేబుల్, ధర్మారం పోలీస్ స్టేషన్
కార్యనిర్వాహక సభ్యులు: ఎం.డి. రిజ్వాన్ షా ఖాన్, హెడ్ కానిస్టేబుల్ 714, సీఎస్బీ రామగుండం; డి. అనిల్ కుమార్, కానిస్టేబుల్, సంత్‌నగర్ పోలీస్ స్టేషన్; సి.హెచ్. దేవరాజ్, కానిస్టేబుల్, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్
కార్యవర్గ సభ్యులు: ఎం. రాజిత, మహిళా పోలీస్ కానిస్టేబుల్, పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్; ఎ. కపిల్, ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్, సీఏఆర్ రామగుండం; డి. రాజం, ఏఆర్ఎస్ఐ, సీఏఆర్ బెల్లంపల్లి
ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు.ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారికంగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం ప్రతినిధులు తక్షణమే స్పందించాలని సూచించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి,వాటి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.పోలీస్ అధికారుల సంఘం సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ,వారి సంక్షేమం కోసం కృషి చేయాలని సీపీ ఆకాంక్షించారు. సంఘం బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేస్తూ పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు.




