Kalva Srirampur: పేకాట రాయుళ్లపై కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ మెరుపుదాడి!

Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం శివారులో పేకాట స్థావరంపై ఎస్ఐ గట్ల సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 2 Aug 2026 8:30 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: పేకాట రాయుళ్లపై కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ మెరుపుదాడి!

కాల్వశ్రీరాంపూర్: ​పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. విశ్వసనీయ సమాచారంతో కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ గట్ల సుధాకర్ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు.

​ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు రంగాలుచేసి పట్టుకోగా, మరో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

​స్వాధీనం చేసుకున్న సొత్తు 2,700 రూపాయలతో పాటు మూడు ​మొబైల్ ఫోన్లు, ​4 ద్విచక్ర వాహనాలు (బైక్‌లు), ​పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు ఎస్ఐ గట్ల సుధాకర్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story